ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో పెంచుకుంటే చాలు… ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు

Ajwain Leaves Health Benefits In telugu: ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించడానికి ఈ మొక్క చాలా బాగా సహాయపడుతుంది. ఈ మొక్క ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క పేరు వాము మొక్క. ఈ మొక్క కూడా చాలా సులభంగా పెరుగుతుంది. వాము ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వామాకుతో బజ్జీలు., పచ్చడి చేసుకోవచ్చు.
vaamu leaf
వాము ఆకు రసంలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. వాము ఏకును నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. తల నొప్పిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

వాము ఆకును దంచి తీసిన రసాన్ని తల నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. వాము ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలో అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వాము ఆకులలో గామా – లినోలెనిక్ వంటి ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.
Joint Pains
అందువల్ల అన్నీ రకాల నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. గామా – లినోలెనిక్ యాసిడ్ కీళ్లనొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో విషాలను, మలినాలను తొలగించటానికి సహాయ పడుతుంది.

వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం సమృద్దిగా ఉంటాయి. నోటి దుర్వాసన స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఈ వాము ఆకులు అద్భుతమైన మౌత్ ఫ్రెష్‌నింగ్ సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. నోటి ఆరోగ్యాన్ని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.