పెరుగుతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా, చుండ్రు లేకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Curd Dandruff Home Remedies In Telugu : మారిన పరిస్టితులు, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక కారణాలతో చాలా మంది జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యలు రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతున్నారు. వాటి ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.
వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. చలికాలంలో పొడి గాలి, తక్కువ తేమ కారణంగా తలపై చుండ్రు ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు.
మిక్సీ జర లో ఒక కప్పు వేప ఆకులు, కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ లో మూడు స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాను ఫాలో అయితే 15 రోజుల్లోనే తేడా కనపడుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద చేసుకొని ఈ చిట్కాను వాడటానికి ప్రయత్నం చేయండి.
ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.