వారంలో 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే చుండ్రు, జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు
Dandruff and Hair Fall Home Remedies In telugu :ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం, కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూలు, నూనెలు వాడటం, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు, జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది.
చుండ్రు సమస్య వచ్చిందంటే తొందరగా తగ్గదు. చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అలాగే జుట్టు పొడిగా మారిపోతుంది. అందువలన చుండ్రు సమస్య రాగానే తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు చెప్పే నూనెను వారం రోజులపాటు వాడితే చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక గ్లాసు ఆవనూనె పోయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ kalonji సీడ్స్, నాలుగు రెబ్బల కరివేపాకు, నాలుగు మందార ఆకులు, అరకప్పు ఉల్లి ముక్కలు వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నూనెను వడగట్టాలి.
ఈ నూనె దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ఒక బాటిల్లో నింపుకొని నిలువ చేసుకోవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు, జుట్టు రాలే సమస్య అన్ని తొలగిపోతాయి. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.