ఒక్క రోజులోనే ముఖంపై ఎంతటి నల్లని మచ్చలు ఉన్నా తొలగిపోయి తెల్లగా మెరిసిపోతారు

Sugar Face Glow Tips In telugu : ముఖం మీద శ్రద్ద పెట్టకపోవటం, వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ముఖంపై మలినాలు, డస్ట్ వంటివి పేరుకుపోవడం సర్వ సాధారణం అయ్యిపోయింది. ముఖాన్ని ఆలా వదిలేస్తే ముఖం నల్లగా,నిస్తేజంగా మారిపోతుంది. ముఖం కాంతివంతంగా కన్పించాలన్నా, తాన్,నలుపు వంటివి తొలగిపోవాలన్నా ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకోవటం వలన ముఖ చర్మం నల్లగా లేకుండా తెల్లగా,కాంతివంతంగా మారుతుంది . బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా ఈ ప్యాక్ వేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో మంచి పలితాన్ని పొందవచ్చు. ఈ ప్యాక్ అడ, మగ ఎవరైనా ట్రై చేయవచ్చు.
cold remedies
ఈ ప్యాక్ ఉపయోగించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్యాక్ కి మూడు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార తీసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పొడి వేయాలి. కాఫీ పొడి సుమారుగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ కలబంద జెల్ ని వేసి బాగా కలపాలి. ఈ మూడు పదార్ధాలు బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
Face Beauty Tips In telugu
ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేయటానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి సున్నితంగా 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద పేరుకుపోయిన మలినాలు, మురికి,మృతకణాలు అన్ని తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది.
Pimples,Beauty
ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ ముఖ చర్మానికి మంచి పోషణ అందించి చర్మ సమస్యలు ఏమి లేకుండా చేస్తాయి. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.