కేవలం 5 నిమిషాల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…జీవితంలో తెల్ల జుట్టు అనేది రాదు
White Hair Tips In Telugu :తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ మధ్య మారిన జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. అలా రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.
అలా వాడటం వలన తాత్కాలికంగా ప్రయోజనం కలిగిన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త సమయాన్ని,శ్రద్దను పెడితే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కా కోసం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవి కొబ్బరి నూనె, టీ పొడి, కాఫీ పొడి.
ఈ మూడు మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే. ముందుగా 2 స్పూన్ల టీ పొడిని పాన్ లో వేసి వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో మెత్తని పొడిగా చేసుకున్న టీ పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట అలా వదిలేసి ఆ తర్వాత తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.