బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Honey Face Glow Tips In Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి అందం మీద శ్రద్ద పెరిగి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు. అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
weight loss tips in telugu
మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోవచ్చు.
Young Look In Telugu
దీని కోసం ముందుగా ఒక పొడిని తయారుచేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి పసుపు వేసి సిమ్ లో వెగించాలి. పసుపు బాగా వేగి రంగు మారాలి. ఈ పసుపును ఒక డబ్బాలో పోసి నిల్వ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే పసుపు కాకుండా ఇంటిలో పసుపు కొమ్ములతో తయారుచేసుకున్న పసుపు అయితే మంచిది.
Honey
ఒక బౌల్ లో ముఖానికి అవసరమైన వేగించిన పసుపును తీసుకొని దానిలో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. పసుపు, తేనే రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.
Pimples,Beauty
పసుపు,తేనె రెండింటిలో ఉన్న లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు లేకుండా తెల్లగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చులో మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.