పుచ్చకాయ తిని గింజలను పాడేస్తున్నారా… ఆ రహస్యం తెలిస్తే అసలు పాడేయరు
watermelon seeds Health Benefits In telugu : ఒకప్పుడు పుచ్చకాయలు వేసవిలో మాత్రమే లభ్యం అయ్యాయి. కానీ ప్రస్తుతం అన్ని సీజన్ లలోను లభ్యం అవుతున్నాయి. మనం సాధారణంగా పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పాడేస్తూ ఉంటాం. మనం పాడేసే గింజలలో ఎన్ని పోషక విలువలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుంటే పుచ్చకాయ గింజలను పాడేయరు. పుచ్చకాయ విత్తనాల్లో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. అంతేకాక విటమిన్ బి, థయామిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, జింక్, పాస్ఫరస్, కాపర్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
ఈ గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, మల బద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి. కాలేయ సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.
రక్త ప్రవాహము బాగా సాగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, పలు రకాల ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి.డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
జ్ఞాపకశక్తి పెంచే ఔషధ గుణాలు కూడా సమృద్దిగా ఉన్నాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మం ముడతలు లేకుండా యవన్నంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుచ్చకాయ గింజలను తినండి. ఇవి మార్కెట్ లో కూడా విరివిగానే లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.