నిమ్మరసంతో ఇలా చేస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా తెల్లగా మారుతుంది
Lemon Juice Face Glow Tips In telugu : మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా రెడీ అవుతారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకొనే చిట్కాతో తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళి,మలినాల కారణంగా చర్మం నిర్జీవంగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా దుమ్ము,ధూళి,నలుపును సమర్ధవంతంగా తొలగిస్తుంది.ఈ చిట్కాకు అవసరమైన అన్ని వస్తువులు మన ఇంటిలో అందు బాటులో ఉండేవే. ఈ చిట్కాను చాలా సులువుగా చేయవచ్చు.
ఈ చిట్కా ఎలా చేయాలి. ఎలా అప్లై చేయాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, అరస్పూన్ కలబంద జెల్, అరస్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖాన్ని తెల్లగా మారుస్తుంది. అలోవెరా జెల్ చర్మాన్ని డీప్ గా క్లిన్ చేసి చర్మ రంద్రాలు మినిమైజ్ చేస్తుంది. తాన్,ముడతలను తొలగిస్తుంది. కాఫీ పొడి చర్మంలో డల్ మరియు డ్రై ప్యాచ్ లను తొలగిస్తుంది.
రోజ్ వాటర్ చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు చర్మానికి మంచి పోషణ అందించి చర్మం తెల్లగా కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను పాటించటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.