Healthhealth tips in teluguKitchen

ఈ ఆహారాలను తింటే మీ ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యిపోతుంది

Bad Cholesterol Tips In telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఆహారంలో మార్పులు చేసుకొని తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్ తినటం ఎక్కువ అయింది. అలాగే వ్యాయామం చేయటం కూడా చేయటం లేదు.
Diabetes patients eat almonds In Telugu
శరీరంలో కొవ్వు పేరుకుపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. గుండెకు సంబంధించి సమస్యలు రావటమే కాకుండా .హార్ట్ స్ట్రోక్ కి కారణం అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ లలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ కారణంగానే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
dark chocolate benefits in telugu
ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాలకు అడ్డుపడితే స్ట్రోక్., గుండె పోటు, కిడ్నీల వైఫల్యానికి దారి తీస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకుని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. avocado లో మోనో అసంతృప్త కొవ్వులు మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బాదం పప్పులో కొలెస్ట్రాల్-తగ్గించే కొవ్వులు, ఫైబర్ ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.
oats benefits
వోట్స్ మరియు బార్లీ బీటా-గ్లూకాన్‌ను అందిస్తాయి. ఈ కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. యాపిల్స్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు మరియు స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు మంచి కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
garlic
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. టీ తాగటం వలన కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇప్పుడు చెప్పిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది. కాబట్టి ఈ ఆహారాలను తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.