కొబ్బరితో ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు లేకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Coconut Hair Fall Tips In telugu:మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించటానికి ఇంటిలోనే ఈ చిట్కాను తయారుచేసుకొని వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

అరకప్పు కొబ్బరిని తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి పాలను తయారుచేయాలి. ఈ కొబ్బరి పాలల్లో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.

ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటె జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది. జుట్టు కుదుళ్ళకు మంచి పోషణ అందుతుంది.
Tea Tree Oil
కొబ్బరి పాలలో ఉండే విటమిన్లు జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి, తద్వారా జుట్టు చిట్లడం చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలుట, తలలో దురద వంటి సమస్యలను తగ్గించటానికి కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. మంచి పలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.