డయాబెటిస్ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Dragon fruit For diabetes: డయాబెటిస్ ఉన్న వారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో తీసుకొనే ఆహారం విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Dragon Fruit Health Benefits In telugu
డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చా అనే విషయాన్నీ తెలుసుకుందాం. ఈ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ వంటివి సమృద్దిగా ఉన్నాయి. దీనిలో పైబర్ సమృద్దిగా ఉంటుంది.
Diabetes diet in telugu
అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్‌గా పరిగణించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాని GI 48-52 మధ్య ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
Dragon fruit Benefits in telugu
అయితే డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ ఎంత మోతాదులో తీసుకోవాలి.. అనే విషయానికి వస్తే..100 గ్రాముల కంటే ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు. ఇలా తింటే 60 కేలరీల శక్తి లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
dragon fruit telugu
ఇతర పండ్లతో కలిపి తీసుకుంటే, సుమారు 50 గ్రాములు తినవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి మరియు అధిక బరువును తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను తాజాగా కట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ లేదా స్మూతీని కూడా ప్రయత్నించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.