ఈ పొడితో ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Amla Hair Fall Home Remedies In telugu :జుట్టు పొడవుగా ఉండాలని సాధారణంగా ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు రాలకుండా పొడవుగా పెరగడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, కాంతివంతంగా పెరుగుతుంది.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల బృంగరాజ్ పౌడర్, రెండు స్పూన్ల ఉసిరి పొడి, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, నాలుగు స్పూన్ల పెరుగు వేసి అన్ని బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
అలాగే జుట్టు చివర్లు చిట్లడం,చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన జుట్టును బలోపేతం చేయడానికి మరియు జుట్టు రాలడాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.
పెరుగులో ఉండే ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ప్రోత్సాహం ఇస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మరియు మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది.
ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఇ వంటివి సమృద్దిగా ఉండుట వలన తల మీద చర్మం తేమగా ఉండటానికి మరియు జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టుకి కండీషనర్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను పాటించి జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.