వీటిని ఇలా తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య మాయం అవుతుంది
Home remedies For Thyroid : ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాలతో థైరాయిడ్ సమస్య చాలా చిన్న వయసులోనే వచ్చేస్తోంది. తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ తీవ్రతను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ అనేది శరీరం యొక్క జీవక్రియ పై ప్రభావాన్ని చూపుతుంది.
ఇది మనిషి మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం థైరాయిడ్ తీవ్రతను తగ్గించడానికి 5 ఆహారాలు బాగా పని చేస్తాయని చెబుతున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులతో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కొబ్బరి మరియు కొబ్బరి నూనె థైరాయిడ్ ఉన్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. జీవక్రియను మెరుగుపరుస్తుంది. రోజు ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవచ్చు. గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం విటమిన్లు, ఖనిజాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.
“సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియకు శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అవసరం. బ్రెజిల్ గింజలు ఈ పోషకం చాలా సమృద్దిగా ఉంటుంది. రోజుకు మూడు బ్రెజిల్ గింజలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.