Beauty TipsHealthhealth tips in telugu

Teeth Health: దంతాలపై పసుపు మచ్చలు ఉన్నాయా? ఈ చిట్కాలను పాటించండి, మిలామిలా మెరిసిపోతాయి

Yellow Teeth Home Remedies In telugu : దంతాలకు సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. దంతాలు గార పట్టి, పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. దంతాలు ఇలా ఉంటే చూడటానికి బాగోవు.అలాగే నలుగురిలోకి వెళ్లాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ సమస్యకు పరిష్కారం ఇంటిలోనే చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది. ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు, అరస్పూన్ ఉప్పు, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ తో దంతాలను శుభ్రం చేసుకుంటే 10 రోజుల్లోనే దంతాలు పసుపు రంగు నుంచి తెల్లగా మారి కాంతివంతంగా మెరుస్తాయి.

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు నోటి దుర్వాసన, నోట్లో ఉండే బాక్టీరియాను తొలగించటంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా, ఉప్పు పళ్ళు తెల్లగా మెరవటానికి సహాయపడతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితం పొందవచ్చు.

దంతాలు పసుపు రంగులో ఉన్నవారు ఓ చిట్కాను పాటిస్తే దంతాలు తెల్లగా మారిపోతాయి. దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ ఖర్చుతో తెల్లని మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.