పగిలిపోయి, నల్లగా మారిన పెదాలపై ఈ పేస్ట్ రాస్తే 2 రోజుల్లో గులాబీ రంగులోకి మారతాయి

Besan Cracked lipsTips : ఈ చలికాలంలో పగిలే పెదాల సమస్య మనలో చాలా మందిని వేదిస్తుంది. పెదాలు మృదువుగా మారాలంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాలను పొందవచ్చు. పెదవుల్లో తేమ తగ్గడం వల్ల పెదవులు పగులుతుంటాయి. దీంతో పెదవులు అందాన్ని కోల్పోవడమే కాకుండా ఇబ్బందిగా ఉంటుంది
Cracked lips
ముఖంలో ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించే పెదాలు గులాబీ రంగులో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ పెద్దగా ప్రయోజనం కనపడదు. దీని కోసం ఖరీదైన కాస్మోటిక్స్ కూడా వాడతారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.
Dry lips beauty tips
అలాగే పెదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. మన ఇంటి వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి పెదాల పగుళ్లను,నలుపును తగ్గించు కోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,కొంచెం నిమ్మరసం, కొంచెం పెరుగు వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
besan
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పెదాల పగుళ్లు తగ్గి నలుపు కూడా తొలగిపోతుంది. పెదాల మీద ఉన్న డెడ్ సెల్ లేయర్ రిమూవ్ అయ్యి లేతగా మారుతాయి. పెదాలు మృదువుగా మారతాయి. లిప్ స్టిక్ ఉపయోగించేవారు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇది రాసుకోవచ్చు. శనగపిండిలో ఉన్న పోషకాలు పెదాలపై ఉన్న మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.
lemon benefits
నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు నలుపును తొలగించటానికి సహాయపడతాయి. అలాగే పెరుగులో ఉండే పోషకాలు పెదాలు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తాయి. కాస్త శ్రద్ద పెట్టి సమయాన్ని కేటాయిస్తే పగుళ్లు,నలుపు లేని గులాబీ రంగు పెదాలు మీ సొంతం అవుతాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.