First Movie తోనే హిట్ కొట్టిన భామలు…ఎంత మంది ఉన్నారో…?

Tollywood Heroines First Movie hit :టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోలు, హీరోయిన్ లు వస్తూ ఉంటారు. వారిలో కొంత మంది సక్సెస్ అవుతారు. సినిమా ఇండస్ట్రీ అంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొందరు హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా హిట్ లేక పక్కకు తప్పుకోవడమో, క్యారెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డామో చేస్తుంటారు. అయితే కొందరు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్,సూపర్ హిట్ అందుకుంటారు.

అందులో తొలి వరుసలో సమంత ఉంటుందని చెప్పాలి. ఏం మాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత హిట్ కొట్టి సక్సెస్ గా ముందుకు సాగుతుంది. సామంత సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ హిట్ అందుకుని వరుస సినిమాలతో బిజీ అయింది. ఫిదా మూవీతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ సాయిపల్లవి తొలిసినిమా తోనే ఫిదా చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ గల సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటోంది.

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తోంది. అర్జున్ రెడ్డి మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించిన శాలిని పాండే తొలిసినిమాతోనే మంచి హిట్ కొట్టింది. అలాగే ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ రాజపుత్ ఎంట్రీ ఇచ్చి ఊహించని విజయాన్ని అందుకుంది