Beauty Tips

Hair Care Tips:హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే పెసలు.. ఎలా వాడాలంటే..

Moong dal Hair growth Tips: వాతావరణంలో కాలుష్యం, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య అధికంగా కనబడుతుంది.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

ఒక బౌల్ లో ఐదు స్పూన్ల పెసలు, ఒక స్పూన్ మెంతులు, రెండు గ్లాసుల నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, మెంతులు, రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. అలాగే హెయిర్ డ్యామేజ్‌, డ్రై హెయిర్ వంటి స‌మ‌స్యల‌ నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.