ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది
Hair Fall Oil In telugu: ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంటిలో నూనెను తయారుచేసుకొని వాడితే మంచి పలితాలను పొందవచ్చు.
ఇప్పుడు చెప్పే నూనెతో వారానికి ఒకసారి జుట్టు కుదుళ్ళకు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. దిని కోసం పార్లర్లు/స్పాలకు వెళ్లి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు. ఈ నూనెలో ఉపయోగించే ఇంగ్రిడియన్స్ కూడా సులభంగానే అందుబాటులో ఉంటాయి.
ఈ నూనె తయారికి… ఒక ఇనుప పాత్రలో ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి. ఇప్పుడు స్టౌ కట్టేసి అందులో గుప్పెడు కరివేపాకు, ఒక స్పూన్ mentulu, ఒక స్పూన్ ఆలివ్ గింజలు, ఒక మందార పువ్వు వేసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. ఈ విధంగా చేయటం వలన ఆయా పదార్థాల్లోని పోషకాలు కొబ్బరి నూనెలోకి చేరతాయి.
మరుసటి రోజు ఉదయం నూనెను వడకట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకోవచ్చు. ఈ నూనెను రాత్రి సమయంలో జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు సమస్యలు అన్ని తొలగిపోతాయి.
నిర్జీవమైన జుట్టు ప్రకాశవంతంగా, పట్టులా మెరుస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలు తొలగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కుదుళ్ల చర్మానికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తద్వారా కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడి జుట్టు బాగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.