Devotional

Maha shivratri 2024:శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎలా చేస్తే మంచిదంటే..

Mahashivratri 2024 : ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8 శుక్రువారం రోజున వచ్చింది. శివుడి, పార్వతిదేవీల వివాహం జరిగిన రోజునే మహాశివరాత్రి పండుగగా మనం జరుపుకుంటాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాట కూడా శివరాత్రి పండుగని భక్తులు జరుపుకుంటారు.అయితే ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు.

ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏం తినకుండా.. రాత్రి కూడా నిద్ర పోకుండా భక్తులు ఆ శివుడిని కొలుస్తారు. అయితే.. ఉపవాసం, జాగరణ ఎలా చేస్తే మంచిదంటే రోజంతా భగవంతుని సన్నిధిలో ఆ భవంతుని చింతన, సేవలో ఉంటూ ఉండడమే ఉపవాసం అంటారు. అంతేకానీ, ఉపవాసమని చెప్పుకుంటూ ఏవేవో ఆలోచనలు చేయడం మంచిది కాదు.

ఇక జాగరణ అంటే భగవంతుని అస్థిత్వమునందు మన మనసు మేల్కొని ఉండడం. మేల్కొని ఉండడమంటే మేలుగా ఉండడమనే అర్థం.. ఈ రోజున భగవంతుని గురించే ఆలోచనలు, భజనలు, కథలు, స్థుతులు చేస్తూ మనసుని ఆ పరమాత్మపైనే కేంద్రీకరించి.. సమయం మొత్తం గడపడం ఇలా చేస్తేనే మనం చేసే జాగరణ, ఉపవాసానికి సార్థకత ఉంటుంది