Maha shivratri రోజు అభిషేకం ఏ విధంగా చేస్తే మంచిదో తెలుసా?
Maha Shivratri abhishekam :శివుడు అభిషేక ప్రియుడు. అందువల్ల శివరాత్రి రోజున వీటితో శివునికి అభిషేకం చేస్తే అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు…ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. అయితే వీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పసుపు నీటితో శివునికి అభిషేకం చేస్తే శుభకార్యాలు జరుగుతాయి. రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలుకలుగుతాయి. పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుటుంది.
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. గరిక నీటితో అభిషేకం చేస్తే నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. మారేడు బిల్వదళ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును.