Tv Serial డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్న బుల్లితెర తారలు ఎంత మంది ఉన్నారో…?

Tv Serial Heroines and directors :బుల్లితెరలో వచ్చే సీరియల్స్ చాలా క్రేజ్ ఉంది. సినిమాల్లోనే బుల్లితెర రంగంలో కూడా నటీనటుల మధ్య పెళ్లిళ్లు, దర్శకులతో పెళ్లిళ్లు సహజమయ్యాయి. చాలామంది నటులు టివి రంగంలో రాణించారు. ఇంకా రాణిస్తున్నారు. తమ నటనతో ఆడియన్స్ కి బాగా కెనెక్ట్ అయ్యారు. ఇక కొందరు తారలు అయితే డైరెక్టర్స్ ని,నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు.

చంద్రముఖి, కలవారి కోడళ్ళు వంటి సీరియల్స్ తో నవీన ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. కలవారి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు వంటి సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా చేసాడు. ప్రస్తుతం యాట మీడియా నెలకొల్పి డైరెక్టర్ గా చేస్తున్నాడు.

కల్యాణ వైభోగం,యమలీల సీరియల్స్ నటిస్తున్న భావన. ఈమె భర్త పేరు విజయ కృష్ణ. యితడు ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ని డైరెక్టర్ చేస్తున్నాడు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మీరా పాత్రలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అనుశ్రీ, స్వాతి చినుకులు డైరెక్టర్ రాజు ని పెళ్లాడింది. నిన్నే పెళ్లాడతా సీరియల్ తో మధుబాల విజయకుమార్ పాపులర్ గా మారింది. ఈమె రచయిత ప్రభాకర్ ని ఈ మధ్య పెళ్లి చేసుకుంది.