పరమ శివునికి వేటితో అభిషేకం చేస్తే ప్రసన్నం అవుతారో తెలుసా?

Shivaratri abhishekam :పరమ శివుడు అభిషేక ప్రియుడు అన్న విషయం మనకు తెలిసిందే. పరమ శివునికి కాసిన్ని నీళ్లు పోసి అభిషేకం చేస్తేనే మనం కోరుకున్న కోరికలు నెరవేరతాయి. పరమ శివునికి నీటితోనే కాకుండా ఎన్నో ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత మరియు పరమార్ధం ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే … ఆ ప్రకారం అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నం అయ్యి కోరిన కోరికలను తీరుస్తారు. అవి ఏమిటో చూద్దాం. 

పరమశివునికి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. 

పరమశివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం,యశస్సు,బలం కలుగుతాయి.

పరమశివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. 

పరమశివునికి తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగుతుంది. 

పరమశివునికి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. 

పరమశివునికి చెరకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. 

పరమశివునికి కొబ్బరినీటితో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి. 

పరమశివునికి భస్మ జలంతో అభిషేకం చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి. 

పరమశివునికి సుగంధ జలంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుంది. 

పరమశివునికి పన్నీరుతో అభిషేకం చేస్తే భూ లాభం కలుగుతుంది. 

పరమశివునికి ద్రాక్ష రసంతో చేస్తే అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. 

పరమశివునికి బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.