ఇలా చేస్తే 1 రోజులో పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి…డాక్టర్ అవసరమే ఉండదు
Home remedies for skin tag removal In Telugu : పులిపిర్లు అనేవి ఒక రకమైన వైరస్ వ్యాపించడం వల్ల వస్తాయి. ఇవి మనలో చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. పులిపిర్లు ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది కూడా కలుగుతుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా పులిపిర్లు సమస్య ఉంటుంది.
పులిపుర్లు ఉండటం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం దురద నొప్పి అనేవి ఉంటాయి. పులిపిర్లను తగ్గించుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది. వెల్లుల్లి పేస్ట్ లేదా ఉల్లిపాయ రసంలో ఉప్పు కలిపి పులిపుర్లు ఉన్నచోట క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి
రాత్రి పడుకునే ముందు అరటిపండు తొక్కను పులిపిర్లపై రుద్దుతూ ఉంటే పులిపిర్లు కొన్ని రోజుల్లో రాలిపోతాయి. ఒక స్పూన్ కొబ్బరి నూనె లో కొంచెం కర్పూరం కలిపి రాయటం వలన కూడా పులిపిర్లు తగ్గుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలలో ఏదో ఒక దానిని ట్రై చేయండి తప్పకుండా పులిపిర్లు సమస్య నుంచి బయట పడవచ్చు. చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.