HealthKitchenvantalu

Rice storage:బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే …. సింపుల్ చిట్కాలు

Biyyam lo purugulu povalante:చాలామంది ఇళ్ళల్లో రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి నిల్వ చేసుకుంటారు. అయితే అలాంటి సందర్భాల్లో బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. పురుగు పట్టిన బియ్యాన్ని వాడాలంటే అసలు మనస్సు ఒప్పదు. అంతే కాకుండా వాటిని శుభ్రం చేయాలంటే తల ప్రాణం తొక్కస్తుంది . గ్రామాల్లో అయితే బియ్యాన్ని ఎండలో పెట్టటం వంటివి చేస్తారు.

సిటీలో అయితే ఆలా కుదరదు కదా. ఈ చిట్కాలను పాటిస్తే బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది. వంటకాల్లో మంచి రుచి కోసం ఉపయోగించే ఇంగువ బియ్యంలో పురుగులు పట్టకుండా చేస్తుంది. ఇంగువకు ఉన్న ఘాటైన వాసన బియ్యానికి పురుగు పట్టకుండా చేస్తుంది.

ఇంగువను ఒక వస్త్రంలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి. బియ్యంలో తేమను కూడా తగ్గిస్తుంది. తేమ కారణంగా కూడా బియ్యం పురుగు పడతాయి. సాధారణంగా చాలా మంది బియ్యం పురుగు పట్టకుండా వేపాకును ఉపయోగిస్తారు. వేపాకులో ఉండే క్రిమి నాశక లక్షణాలు బియ్యంలో పురుగు పట్టకుండా చేస్తాయి.

బియ్యంలో వేపాకు రెబ్బలను ఎండబెట్టి వేయవచ్చు. అలాగే వేపాకులను ఎండబెట్టి పొడిగా చేసుకొవాలి. ఆ పొడిని వస్తంలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యంలో వేయవచ్చు. ఈ విధంగా చేయటం వలన బియ్యంలో తెల్లపురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.