Healthhealth tips in telugu

బాదంప‌ప్పును రోజూ ఈ స‌మ‌యంలోనే తినాలి.. అప్పుడే ఎక్కువ‌ లాభాలు క‌లుగుతాయి..మీకు తెలుసా ?

Almonds Health benefits in telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. అలాంటి డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటి. బాదంపప్పులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలామందికి బాదం పప్పును ఏ సమయంలో తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది అనే సందేహం ఉంటుంది.
Diabetes patients eat almonds In Telugu
బాదంపప్పును రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బాదం పప్పు తొక్క తీసి బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే మంచిది. రోజుకి 4 లేదా 5 బాదం పప్పులను తీసుకుంటే సరిపోతుంది.బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల నీరసం, నిస్సత్తువ, అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా పని చేసుకుంటూ ఉంటారు. .
Brain Foods
మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బాదం పప్పును ఉదయం సమయంలో తినడం వల్ల మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా మన శరీరానికి అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బాదం పప్పును నానబెట్టి పై తొక్క తీసి తినటం వలన బాగా జీర్ణం అయ్యి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అన్నీ వయస్సులవారు తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.