Healthhealth tips in telugu

1 గ్లాస్ తాగితే చాలు తిమ్మిర్లు, నరాల వాపు,శారీరక నొప్పులు,అధిక బరువు అనేవి ఉండవు

Bay Leaf Drink : ఈ రోజుల్లో సమస్యలు అనేవి చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒంటి నొప్పులు,అధిక బరువు, తిమ్మిర్లు,నరాల వాపు వంటి సమస్యలను తగ్గించుకోవటానికి ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
sompu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త గోరువెచ్చగా అయ్యాక దానిలో రెండు చిన్న బిరియాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ వాము,పావుస్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. అవసరమైతే తేనె కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.

ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. శరీరంలో ఏ బాగంలో నొప్పి ఉన్న తగ్గిపోతుంది. కాళ్లు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో తిమ్మిరి ఉన్నా.. నరాల్లో వాపు ఉన్నా.. తగ్గిపోతుంది.
Bay Leaf diabetes
శరీరంలో జీవక్రియను పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుస్తుంది. అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.