మీ వంటింట్లో ఎన్నిపెయిన్ కిల్లర్స్ ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు…ఇది నిజం

Natural Pain Killers :ఈ రోజుల్లో ఎంత చిన్న నొప్పి వచ్చినా ముందుగా పెయిన్ కిల్లర్స్ వైపు చూస్తున్నారు. కాలు నొప్పి వచ్చినా నడుం నొప్పి వచ్చినా చెవి నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా ఇలా ఏం నొప్పి వచ్చినా మెడికల్ షాప్ కెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావటమే కాకుండా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Pudina Health benefits in telugu
అంతేకాకుండా ఈ మందుల ప్రభావం గుండె, లివర్, కిడ్నీల మీద ఉంటుంది. ఇలా మందుల మీద ఆధారపడకుండా చిన్నచిన్న నొప్పులకు మన వంటగదిలో ఉండే దినుసులతో తగ్గించుకోవచ్చు. ఆ దినుసులు ఏమిటి…అవి ఏ నొప్పులను తగ్గిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అల్లం కడుపు నొప్పి ఛాతీ నొప్పి గ్యాస్ నొప్పి వంటి వాటిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Ginger benefits in telugu
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే సరిపోతుంది. లవంగం పంటి నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో లవంగం పెట్టుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.వెల్లుల్లి కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఆవనూనె లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చేసి ఆ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసుకుంటే నొప్పులు తొందరగా తగ్గుతాయి
Health Benefits Of Eating Pudina
పుదీనా తలనొప్పి, నరాల నొప్పులు తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఐదు నుంచి ఆరు పుదీనా ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ చిట్కాలు బాగా సహాయపడతాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకొని ఆ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం తొందరగా వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.