ఇలా చేస్తే వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం
Billa ganneru for white hair In Telugu :చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. దాంతో వయస్సుకి మించి కనపడతారు. దాంతో జుట్టుకి రంగు వేయటం ప్రారంభిస్తారు. ఇలా రంగు వేయటటం వల్ల జుట్టు నల్లగా మారిన నేచురల్ గా కనపడదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. హేయిర్ డై లో ఉండే రసాయనాలు కారణంగా జుట్టు రాలిపోతుంది.
సహజసిద్ధంగా జుట్టు రంగును నల్లగా మార్చుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా ప్రకాశవంతంగా మారుతుంది. ఇప్పుడు తెల్లజుట్టు నల్లగా మారటానికి మంచి ఎఫెక్టివ్ చిట్కా గురించి తెలుసుకుందాం. కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవి మనకు అందుబాటులో ఉండేవే.
ఈ చిట్కా చేయటం కూడా సులభమే. ఎలా తయారుచేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం బిళ్ళ గన్నేరును ఉపయోగిస్తున్నాం. బిళ్ళ గన్నేరు చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉండే కాంపౌండ్స్ తెల్ల జుట్టును నల్లగా మార్చుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా సహాయాపడుతుంది. బిళ్ళ గన్నేరు ఆకులను మిక్సీ చేసి రసం తీయాలి.
ఒక బౌల్ లో 2 స్పూన్ల బిళ్ళ గన్నేరు రసం వేసి దానిలో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇక కొబ్బరి నూనె విషయానికి వస్తే జుట్టులో తేమ ఉండేలా చేసి జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.