శనగపిండిలో ఇది కలిపి రాస్తే నల్లని మచ్చలు,మొటిమలు తొలగిపోయి ముఖం మిలమిలా మెరుస్తుంది
Besan Face Glow Tips In telugu : ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ప్యాక్ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి. అరస్పూన్ కలబంద జెల్, రెండు స్పూన్ల నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక నార్మల్ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి కాంతివంతంగా మెరిసిపోతుంది.
శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ వంటి అనేక పోషకాలు ఉండుట వలన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను తగ్గిస్తుంది. మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మంపై తేమ ఉండేలా చేస్తుంది.
ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు ఇలా అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. శనగపిండి,కలబంద అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.