3 నిమిషాల సమయం ఉంటే చాలు తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం
white hair to black hair tips in telugu :ఈ రోజుల్లో తెల్లజుట్టు సమస్య అనేది సాదరణం అయ్యిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఒక బౌల్ లో మెత్తని పొడి చేసుకున్న టీ పొడి ఒక స్పూన్, అరస్పూన్ కాఫీ పొడి, 50 ml కొబ్బరినూనె, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి.
నూనె వేడి అయ్యాక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ఎప్పటికప్పుడు కూడా తయారుచేసుకోవచ్చు. ఈ నూనెను గోరువెచ్చగా చేసుకొని తలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసి 2 గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య కూడా తొలగిపోతాయి. అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. అయితే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.