హీరోయిన్ మహేశ్వరి గుర్తు ఉందా… సినిమా ఛాన్స్ లు లేక ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Gulabi movie actress maheswari :సినిమాల్లో వారసత్వంగా గానీ, ఫలానా స్టార్ హీరోయిన్ చెల్లెలుగానో, తమ్మడిగానో ఎంట్రీ ఇచ్చి స్వశక్తితో ఎదిగిన వాళ్ళూ చాలామంది వున్నారు. ఇక స్టార్ హీరోయిన్ శ్రీదేవి చెల్లెలుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి ఎన్నో సినిమాల్లో నటించి తనదైన ముద్రవేసింది. ముఖ్యంగా గులాబీ సినిమా ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉండగానే హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్ళిచేసుకుని సినిమాలకు దూరంగా జరిగింది. వరుస అవకాశాలతో బిజీగా ఉండే మహేశ్వరీ పెళ్లి తర్వాత ఏమి చేస్తోందన్న విషయాన్నీ గమనిస్తే ఆశ్చర్య పోతాం.

నిజానికి స్వచ్ఛమైన తెలుగు కుటుంబానికి చెందిన మహేశ్వరి తల్లి పేరు సూర్యకళ. తండ్రి పేరు మహేష్. మీకోసం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి ఆ సినిమా బాగా ఆడకపోయినా ఆడియన్స్ ని బానే ఆకట్టుకుంది. నంది అవార్డు అందుకుంది. ఇక తమిళంలో కరుతుంగ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. 1995లో విడుదలైన గులాబీ సినిమా కుర్రకారులో సెన్షేషన్ అయింది. ఈ మూవీ మహేశ్వరి కెరీర్ ని మార్చేసింది. ఈ సినిమా హీరో చక్రవర్తి, కేరక్టర్ యాక్టర్ బ్రహ్మాజీలకు మంచి బ్రేక్ ఇచ్చింది.

ఇక మహేశ్వరికి వరుస ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. తమిళ తెలుగు భాషల్లో దూసుకెళ్లింది. తెలుగులో మృగం,దెయ్యం,పెళ్లి,ఉల్లాసం,ధీరుడు,మా బాలాజీ,తిరుమల తిరుపతి వెంకటేశా,వంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో అదరగొట్టేసింది. అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరమైనా,టివిలో తళుక్కున మెరిసింది. అది కూడా తెలుగు బుల్లితెరపైనే కావడం విశేషం. మూడేళ్ళ పాటు టివి ఆడియన్స్ ని వినోదంలో ముంచింది. అయితే ఈమె మంచి ఫ్యాషన్ డిజైనర్ గా ఎంతోమంది సెలబ్రిటీలకు డిజైన్ చేస్తోంది.