వేప పువ్వు గురించి ఈ నిజాలు తెలియకపోతే చాలా నష్టపోతారు..ఇది నిజం

Neem Flower Benefits In telugu: సాదారణంగా వేప చెట్టు గురించి అందరికీ తెలుసు. వేప నుంచి వచ్చే ప్రతి బాగం మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. వేప చెట్టు ఎంతో స్వచ్చమైన గాలిని అందిస్తుంది. అందరికీ వేప ఆకుల గురించి తెలుసు. కానీ వేప పువ్వు కూడా మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
neem leaves benefits in telugu
వేప ఆకులోనే కాదు వేప పువ్వులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉగాది పచ్చడిలో వేప పువ్వును వేసుకొని తింటాము. వేప పువ్వు తింటే శరీరం వజ్రంలా మారుతుందని మన పెద్దలు చెప్పుతారు. అలాంటి వేప పువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
vepa puvvu
వేప చెట్టులో ప్రతి బాగం ఉపయోగపడటం వలన వేప చెట్టును విలేజ్ ఫార్మసీ అని పిలుస్తారు. వేప పువ్వును సేకరించి బాగా శుభ్రంగా కడిగి బాగా ఆరేవరకు నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరాక వేప పువ్వును గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ వేప పువ్వు ఎంతకాలం అయిన నిల్వ ఉంటుంది. వేప పువ్వును పొడిగా కూడా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
gas troble home remedies
వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. వేప పువ్వును వంటల్లో పొడి రూపంలో వాడతారు. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేప పువ్వు పొడి లో నీటిని కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.
Young Look In Telugu
అలాగే దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. బ్యాక్ హెడ్స్ ని తగ్గిస్తుంది. వేప పువ్వులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మంలో అధిక జిడ్డును,పొడిదనంను తగ్గించటంలో సహాయపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చర్మాన్ని సంతులనం చేస్తుంది. వేప పువ్వుల పొడిలో నీటిని కలిపి తలపై చర్మంపై రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తలలో చుండ్రు,దురద వంటి సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అంతేకాక జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.