రామ్ చరణ్ సినిమాల్లోకి రావటానికి యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా ?

Ram Charan Movies :ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు వారసత్వమే సినీ రంగాన్ని ఏలుతోంది. ఒకరి తర్వాత ఒకరు తమ వారసులను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. కొందరు క్లిక్ అవుతున్నా, కొందరు క్లిక్ కావడంలేదు అందుకే ఎంట్రీ ఇప్పించేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా రాజీ పడడంలేదు. ఇక మెగాస్టార్ తనయుడంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు.
Ram Charan Watch Price in telugu
అందుకే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. చిరుత మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీలో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు.ఇక రంగస్థలం మూవీలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ ఎంతలా ఒదిగిపోయాడో చూసాం. అన్ని రకాల హంగులతో ,అద్భుత నటనతో సినిమా నడిచింది. ఇంతకీ ఎక్కడ నటన నేర్చుకుని ఉంటాడనే చర్చ రంగస్థలం తర్వాతే స్టార్ట్ అయింది.

వైజాగ్ లో సత్యానంద్ దగ్గర పవన్ కళ్యాణ్,ప్రభాస్ వంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన మంచి రచయితగా ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. అయితే చెర్రీ కూడా అక్కడే శిక్షణ తీసుకున్నాడని భావిస్తారు. కానీ ముంబైలో శిక్షణ తీసుకున్నాడని చాలామందికి తెలీదు. హృతిక్ రోషన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు శిక్షణ పొందిన కిషోర్ నమిత కపూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో టాలీవుడ్ నటులు అల్లు అర్జున్,శర్వానంద్, ఆర్యన్ రాజేష్ లాంటి వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.

అలాంటి చోట చెర్రీ శిక్షణ తీసుకున్నాడు. పాఠాలు నేర్చుకున్న చోటే నటించాలని హిందీలో జంజీర్ మూవీ చేసాడు. తెలుగులో తుపాన్ పేరుతొ విడుదలైన ఈమూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ లో హిట్ కాకపోవడంతో ఇక టాలీవుడ్ కి పరిమితం అయ్యాడు. సినిమాల్లో నటిస్తూ మరోపక్క నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు.