బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Curd Face Glow Tips: ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు మన ముఖం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపు తున్నాయి. ముఖం పొడిగా లేదా జిడ్డుగా మారుతుంది. అలాగే నల్లని మచ్చలు, మొటిమలు వంటివి కూడా ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది ఈ సమస్యలు రాగానే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
Face Beauty Tips In telugu
అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ టమాటా పేస్ట్, ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ పసుపు వేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే చర్మం మీద మొటిమలు, ముడతలు, నల్లని మచ్చలు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. టమోటా ఎక్స్‌ఫోలియేట్ గా పనిచేసి మృత చర్మ కణాలను,జిడ్డును తొలగించి చర్మం మృదువుగా తెల్లగా మెరిసేలా చేస్తుంది.
curd benefits in telugu
పెరుగులో అధిక మొత్తంలో విటమిన్ డి, ప్రొటీన్లు మరియు ప్రోబయోటిక్స్ ఉండుట వలన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. పెరుగు చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచి ముఖానికి సమానమైన టోన్ ఇస్తుంది. అంతేకాక పిగ్మెంటేషన్ మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
weight loss tips in telugu
పసుపులో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన చర్మానికి మెరుపును ఇస్తుంది. చర్మ కణాలను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. అలాగే డార్క్ స్పాట్స్, ఫైన్ లైన్స్ మరియు ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా ఆలస్యం చేస్తాయి. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.