డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆకు కషాయం తాగితే ఏమి అవుతుందో తెలుసా?

Mango leaves diabetes in telugu: డయాబెటిస్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే ఆకుతో కషాయం చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనం కనపడుతుంది.
Diabetes In Telugu
మామిడి ఆకులు డయాబెటిస్ నియంత్రణకు చాలా బాగా సహాయపడతాయి. ఒక ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఇలా వీలు కానీ వారు మరో రకంగా కూడా తాగవచ్చు.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక మామిడి ఆకు ముక్కలను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే పరగడుపున తాగాలి. లేదా కొన్ని ఆకులు తీసుకుని వెలుతురు సోకని, చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఎండిపోయిన తర్వాత వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా వాడవచ్చు.
mango benefits
మామిడి ఆకుల్లో విటమిన్లు, ఎంజైములు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన డయాబెటిస్ ఒక్కటే కాదు.. జ్వరం, జలుబు, విరేచనాలు, నిద్రలేమి, నరాల బలహీనత, ఉబ్బసం వంటి ఎన్నో సమస్యలకు ఈ ఆకులు గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.