ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు,మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది
Rose Water FAce Glow Tips In Telugu :ప్రతి ఒక్కరూ ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. ముఖం అందంగా ఉండటానికి ఎంత ఖర్చు అయినా పెట్టటానికి సిద్దంగా ఉంటారు. అంతేకాకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో ఉండే రెండే రెండి ఇంగ్రిడియన్స్ తో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా చేసుకోవచ్చు.
ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ముల్తాని మట్టి వేసి దానిలో 2 స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఆరాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముల్తాని మట్టి లో ఉండే లక్షణాలు ముఖం మీద జిడ్డును తొలగించటానికి సహాయపడతాయి.
అలాగే రోజ్ వాటర్ కూడా ముఖాన్ని కాంతివంతం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా మన ఇంటిలోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.