ఒక స్పూన్ నూనె జుట్టు రాలే సమస్య తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

Hair Fall Tips in telugu : జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెలను వాడితే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
hair fall tips in telugu
జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. ఒక పాన్ తీసుకొని రెండు తమలపాకులను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని వేయాలి. ఆ తర్వాత మూడు కరివేపాకు రెబ్బలను ఆకులుగా విడ తీసి వేయాలి.
Tamalapaku Health benefits In telugu
ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజి విత్తనాలు వేసి దానిలో కొబ్బరి నూనె వేయాలి. వీటన్నింటినీ వేసుకున్నాక ఈ పాన్ ను పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి.
fenugreek seeds
ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ నూనె రాయటం వలన చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. ఈ నూనెను ఒక సారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

అలాగే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.