Healthhealth tips in telugu

ఈ సీజన్ లో మాత్రమే దొరికే పనస తొనలను తింటే ఊహించని లాభాలు…అసలు నమ్మలేరు

Jack Fruit Benefits In Telugu : పనస పండును ఆంగ్లంలో  Jackfruit అని  అంటారు. అత్యంత తియ్య‌ని రుచిని, తీయ‌టి వాస‌న‌ను క‌లిగి ఉన్న ప‌న‌స పండంటే అందరూ ఇష్టపడతారు. కొన్ని ప్రాంతాలలో పనస పొట్టును కూరగా కూడా చేసుకుంటారు. పనసపండు వేసవి కాలం నుండి సెప్టెంబర్ వరకు విరివిగా లభ్యం అవుతాయి.
jack fruit benefits
పనస పండులో విటమిన్స్,ఖనిజాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులో ‘ఏ’,‘సి’ విటమిన్లు తక్కువగాను, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అది అంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి.
gas troble home remedies
పనస తొనలు త్వరగా జీర్ణం కావు. అందువల్ల మితంగా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పనస పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను అధిగమించడంలో పనసపండు సహాయపడుతుంది. పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి.
jack fruit seeds
ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ (phytO nutriyants) , ఐసోఫ్లేవిన్స్ (isOphlavins) ఉన్నందున క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. ప్రేగు, లంగ్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడడంలో ఈ పండు సహాయ పడుతుంది. పనసపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటును నివారిస్తుంది.రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా ఉండే పనసతొనలను తింటే ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది.

ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కంటికి సంబందించిన సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలోని పోషకాలు గునే ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.