వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా,బలంగా,పొడవుగా నాలుగు రెట్లు వేగంగా పెరుగుతుంది
Cloves Hair fall Tips In Telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది.జుట్టు పొడవుగా పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రీడెంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.
ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెమిడీ చేయటం చాలా సులువు. కాస్త సమయం,శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఈ రెమిడీ కోసం ఒక బౌల్ లేదా ఒక గాజు సీసాలో 3 స్పూన్ల బియ్యం, 5 లవంగాలను వేసి నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం నీరు జుట్టుకి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. లవంగాలులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.