ఇలా చేస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం
star anise Face Glow Tips In telugu : మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవటం కూడా సహజమే. ముఖం కాంతివంతంగా మారటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే చాలు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ అనాసపువ్వు పొడిని వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది.
అనాసపువ్వు అనేది మనలో చాలా మందికి మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. ఇది చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. చర్మం మీద ముడతలు లేకుండా బిగుతుగా ఉండేలా చేయటమే కాకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలు,నల్లని మచ్చలను తగ్గిస్తుంది.
అనాసపువ్వులో అనెథోల్ ఉంటుంది, ఇది చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేయడం ద్వారా, చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడే టానిన్లు కూడా ఇందులో ఉన్నాయి.కణజాలంలోకి చొచ్చుకుపోయి ముడతలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.