ఈ సీజన్ లో దొరికే ఈ పండును అసలు మిస్ చేసుకోవద్దు…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు
Neredu pandu Benefits In telugu :చూడడానికి నల్లగా.. తినేటప్పుడు కొంచెం చేదుగా, పులుపుగా ఉండే పండు నేరేడు పండు. దీనిని ఇంగ్లీష్ లో జామున్ అంటారు. నేరేడు చెట్లు ఎక్కువగా భారతదేశం, పాకిస్థాన్ మరియు ఇండోనేషియాలలో పెరుగుతాయి. నేరేడు చెట్లు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
ఈ చెట్లు 100 ఏళ్లకు పైగా జీవించగలవు.రామాయణంలో సీతా రాములు పదునాలుగేళ్ళు వనవాసం చేసినప్పుడు ఈ నేరేడు పండ్లనే ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారట. భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో ఈ పండ్లను దేవతా ఫలంగా కొలుస్తారు. నేరేడు చెట్టు కలపను తలుపులు, కిటికీలు మొదలగువాటిని తయారుచేయడానికి వాడుతుంటారు.నేరేడులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం వంటి విటమిన్స్ అధిక మోతాదులో లభిస్తాయి. నేరేడులో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. నేరేడు ఇనుము పుష్కలంగా ఉంటుంది.
శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర చాలా కీలకమైనది. ఈ పండ్లను తినటం వలన జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు .
దీనిని ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మధుమేహం ఉండేవారిలో తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు ఉంటాయి. అవి కూడా అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.
నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో గుండె పనితీరు మెరుగ్గా ఉండి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.