ఈ ఐదు రాశుల్లో మీ రాశి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు… 2023 లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

zodiac lucky in 2023 :జాతకం మీద నమ్మకం లేదని చాలామంది అంటారు గానీ, జాతకాల ప్రకారం నడుచుకుంటూ,వాటిపై ఆసక్తి పెంచుకునేవారు ఎక్కువే మరి. భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని కొందరైతే తెగ ఉబలాట పడతారు. ఇక మరో నాలుగు నెలల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కదా. తమ జాతకం ఎలాఉందోనని సహజంగా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఓ ఐదు రాశులవారికి 2023 తిరుగులేదని అంటున్నారు. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుందట.
vruchika rasi
వృశ్చిక రాశి వారు జలతత్వపు రాశివారుగా చెబుతారు. వ్యాపారం చేసేవాళ్ళు బాగా రాణిస్తారు. రక్షణ రంగంలో ఉద్యోగం వీరి సొంతం అవుతుంది. గత 10ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. చిన్నపిల్లలకు సైతం రాజయోగమే సిద్ధిస్తుంది. అన్నింటా విజయం వరిస్తుంది.

సింహ రాశి వాళ్లకు అదృష్టమే అదృష్టం అని శాస్త్ర పండితులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి బంగారు సమయం జీవితంలో మళ్ళీ వస్తోందో రాదోనని అంటున్నారు. ఈ రాశివారికి అధిపతి సూర్యుడు. 2023లో ఈ రాశివారికి సూర్యుడు మంచి యోగాన్ని కల్గిస్తాడు. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూసే ఈ రాశివారికి ఉద్యోగం ఖాయం. వ్యాపారులకు గతంలో పోయిన దానికి రెండింతలు ఈ ఏడాది వచ్చి చేరుతుందని బలంగా చెబుతున్నారు. గతంలో ఇచ్చిన అప్పులు వెనక్కి వస్తాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి.

ఇక మరో రాశి మేషరాశి. అగ్నితత్వం గల ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం కుజుడు 9వ నెంబర్ లో ఉంటాడు. 2023 ని కూడితే వచ్చే 7 కూడా 9కి దగ్గర సంబంధం వున్నదే. అందుకే ఈ ఏడాది అన్ని విజయాలు వరిస్తాయి. నిజంగా ఓ స్వర్ణయుగం గా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళనుంచి ఎదురుచూసే వివాహం ఈ ఏడాది అవుతుంది. ఆర్ధిక పరిస్థితి బలపడి ఇల్లు కూడా కడతారు.

అలాగే ధనుస్సు రాశివారికి పరిశీలిస్తే అగ్ని తత్త్వం గల రాశి. గురువుని ప్రత్యేక ఆరాధన చేస్తే, పట్టిందల్లా బంగారమే. జీవితంలో పైకి రావడానికి ఈ ఏడాది ఓ సువర్ణావకాశం. ప్రేమ వివాహం కోసం ఎదురుచూసే వారికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. విద్యార్థులు లక్ష్యాలను చేరుకుంటారు. ఎన్నో ఏళ్ళనుంచి ఉన్న కోర్టు వ్యవహారాలు సానుకూలం అవుతాయి. అన్ని రంగాల్లో విజయాలు వస్తాయి.

వృషభ రాశివారు ధనయోగం ఉంటుంది. ఇది భూతత్వ రాశి. ఈ రాశికి ద్వితీయ స్థానం మిధునరాశి. మృగశిర, ఆరుద్ర పునర్వసు ,నక్షత్రాలు మిధునరాశిలో ఉంటాయి. కుజుడు, రాహువు బుధుడు అధిపతులుగా వుంటారు. దీనికి బుధ గ్రహం అధిపతి. అందుకే బుధ గ్రహం అంటే పండితుడు. వాళ్లతో సత్సంబంధాలు కల్గి ఉండాలి. నిజానికి ఈరాశివార్కి ధనకాంక్ష ఎక్కువ. ధనయోగం యోగం సిద్ధించాలంటే. గురుడు వల్లే సాధ్యం. ఆడంబరాలు ఎక్కువే. అయితే ఓర్పు సహనం ఉండాలి. శివారాధన చేస్తే శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే, మంచిది. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే, చాలా శ్రేష్టం. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.