ఈ నూనెలో ఇది కలిపి రాస్తే ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది… తెల్ల జుట్టు నల్లగా మారుతుంది
Almond Hairfall Tips In telugu : ఈ మధ్యకాలంలో చాలా మందిని వేదిస్తున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. జుట్టు రాలటం ప్రారంభం కాగానే చాలా మంది కంగారుపడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. కాస్త శ్రద్దగా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం. ఒక బౌల్ లో 2 స్పూన్ల కలబంద జెల్, 2 స్పూన్ల బాదం నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.
ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. కలబంద జెల్, బాదం నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ చిట్కా ఫాలో అయితే చక్కని ఫలితం వస్తుంది. ఏదో ఒక వారం ఈ రెమిడీ ఫాలో అయ్యి సమస్య తగ్గలేదు అంటే కుదరదు. కనీసం 4 వారాల పాటు చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.