మీ పేరు R అక్షరంతో ప్రారంభం అవుతుందా… మీ జీవితంలో ఏమి జరుగుతుందో…?

Letter R First name : మీ పేరు R అక్షరంతో ప్రారంభం అయితే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆంగ్ల అక్షరాల్లో R అనే అక్షరంతో అంటే రాజు,రామారావు,రాహుల్,రాజ్యలక్ష్మి, రాజేశ్వరి,రాజేంద్ర ఇలా ఎవరి పేరు R అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో,వారి గుణగణాలు తెలుసుకుందాం. నిపుణుల అంచనా ప్రకారం, R అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్ల వాళ్ళు గుణవంతులుగా, నేర్పరులుగా ఉంటారు.

ఎక్కడ ఎలా ఉండాలి,ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే నేర్పరితనం వీరికి కొంచెం అధికంగా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలో అనే ఎప్రోచ్ విధానం వీరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. గుణవంతులుగా, నేర్పరులుగా ఉండడం వలన ఈ రెండు ఆయుధాలతో వీళ్ళు జీవితంలో ఏ రంగంలో ఉన్నా ఓ స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక ఏ విషయాన్నైనా చూసిన వెంటనే నేర్చుకోవడం వలన చాలా రంగాల్లో వీరికి మంచి అవగాహన ఉంటుంది.

అయితే R అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వాళ్ళు, ప్రత్యేక శిక్షణ లేకుండానే రాణిస్తారు. చిన్న స్థాయిలో ఉద్యోగం కానీ, ఉపాధి కానీ ప్రారంభించినా,మంచి స్థాయికి ఎదుగుతారు. తమ పట్ల తమకు ప్రేమ, ఆత్మవిశ్వాసం ఉంటాయి. జీవితంలో మాటే వీరికి ఆయుధం. ఇక ఆరోగ్యంగా జీవించడానికి అనువైన అలవాట్లు ఉంటాయి. జీవిత ప్రారంభంలో కొన్ని కష్ఠాలు కన్నీళ్లున్నా, అనతికాలంలోనే వృద్ధిలోకి వస్తారు.

అయితే ఏదైనా చెడు వ్యసనం అలవాటైతే మాత్రం జీవితంలో అన్నీ పోగొట్టుకుంటారు. అందుకే వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే ఒకేసారి నాలుగైదు పనులు ప్రారంభించరాదు. ఒకదాని తర్వాత ఒకటి నింపాదిగా మొదలు పెట్టాలి. అప్పుడే లక్ష్యాలను సాధిస్తారు. ఒకేసారి నాలుగైదు చోట్ల పెట్టుబడి పెడితే మోసానికి గురవుతారు.

అందుకే జాగ్రత్తగా ఒక దాంట్లో విజయం సాధించాక రెండో దానిపై దృష్టి పెట్టాలి. అప్పుడు విజయం వరిస్తుంది. ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో కూడా వీరు దిట్ట. అన్ని రంగాల్లో రాణించాలని ఆశించి,ఒకదాని తర్వాత మరో దాంట్లో విజయం సాధిస్తూ జీవితంలో పైకి వస్తారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.