3 స్పూన్ల పెరుగు చాలు మీ ముఖం 10 రేట్లు కాంతివంతంగా మెరుస్తుంది

Face Glow Tips In Telugu :ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా అనుకోవటం సహజమే. అయితే ముఖం అందంగా కనపడటానికి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
weight loss tips in telugu
అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. దీని కోసం 3 స్పూన్ల పెరుగును ఒక క్లాత్ లో వేసి పెరుగు నుంచి నీటిని తీసేయాలి. నీటిని వేరు చేసిన పెరుగులో ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ పంచదార కలిపి స్క్రబ్ గా ఉపయోగించాలి.
cold remedies
ఇలా స్క్రబ్ చేయటం వలన చర్మంపై పెరుకుపోయిన దుమ్ము,ధూళి ,మృతకణాలు,బ్లాక్ హెడ్స్ వంటివి అన్నీ తొలగిపోతాయి. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగులో పావు స్పూన్ పసుపు,అరస్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి నార్మల్ నీటితో శుభ్రం చేసుకోవాలి.
besan
ఆ తర్వాత మిగిలిన ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ గందము పొడి,కొంచెం రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే మొటిమలు,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.