గుడ్డు ఉడికించినప్పుడు పగిలిపోతుందా… ఆలా పగిలిపోకుండా ఉండాలంటే అద్భుతమైన చిట్కా

Kitchen Tips in telugu:గుడ్డు ఉడికించినప్పుడు పగిలిపోతుందా… ఆలా పగిలిపోకుండా ఉండాలంటే గుడ్డు ఉడికించి నీటిలో కొంచెం వెనిగర్ వేస్తె సరిపోతుంది. గుడ్డు పగలకుండా ఉడుకుతుంది.

పిండి వంటలు చేసినప్పుడు నూనె ఒక్కోసారి పొంగుతూ ఉంటుంది. ఆలా పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేయాలి. తమలపాకు వేగాక తీసేయాలి.

మిగిలిపోయిన బ్రేడ్ ని ఒవేన్ లో వేడి చేసి పొడి చేసుకొని కూరల్లో వేసుకుంటే కూరకు మంచి రుచి వస్తుంది.

పులిహోర చేసినప్పుడు చాలా మందికి అన్నం ముద్దగా అయ్యిపోతుంది. ఆలా అవ్వకుండా ఉండాలంటే అన్నం ఉడికించే సమయంలో ఒక స్పూన్ నెయ్యి లేదా వెన్న వేస్తె అన్నం పొడి పొడిగా వస్తుంది.

కొబ్బరి చిప్పలు తాజాగా ఉండాలంటే చిప్ప లోపల నిమ్మరసం రాయాలి. ఈ విధంగా చేయటం వలన కొబ్బరి చిప్పలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.

కోడిగుడ్డు పెంకులను కిటికీలు,వెంటిలేషన్ దగ్గర పెడితే ఇంటిలోకి క్రిమి కీటకాలు ఏమి రావు.

కారం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో ఇంగువ మూట వేయాలి.

కొత్తిమీర,పుదీనా పచ్చడి చేసినప్పుడు రంగు మారకుండా ఉండాలంటే పచ్చడి చేసిన వెంటనే నిమ్మరసం పిండాలి.

పెసరపిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాను తోమితే కొత్త వాటి వలె మిలమిల మెరిసిపోతాయి.

పచ్చిమిర్చి కోసినప్పుడు చేతులు మండటం సహజమే. ఆలా చేతులు మండకుండా ఉండాలంటే పంచదార కలిపిన నీటితో చేతులను కడగాలి.

ఆకుకూరలను వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే రంగు కోల్పోకుండా మంచి రుచిగా ఉంటుంది.

ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు పంచదార వేయాలి. పంచదార వేయటం వలన మంచి కలర్,రుచి వస్తుంది.

ఆమ్లెట్ వేసినపుడు మంచి రుచి రావాలంటే కొంచెం పంచదార,కొంచెం పాలు పోయాలి. ఆమ్లెట్ కి మంచి రుచి రావటమే కాకుండా బాగా పొంగుతుంది.