దీనిలో చిటికెడు పసుపు వేసి తలకు రాస్తే 15 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది
Coffee White Hair Tips In Telugu :ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది తెల్లజుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లు వాడేస్తుంటారు. అయితే ఇలా హెయిర్ డ్రై వాడటం వల్ల జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు రావడానికి వంశపారంపర్యం ఒక కారణం అవుతుంది అలాగే థైరాయిడ్ సమస్య అధిక ఒత్తిడి ఆందోళన అవుతాయి చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తే పోషకాహార లోపం వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,2 లేదా 3 స్పూన్ల టీ డికాషన్, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు,తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే తెల్లజుట్టు చాలా సులభంగా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.