కొబ్బరి నీళ్ళతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Hair loss Remedies in telugu: రోజుల్లో మారిన జీవనశైలి,వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తినకపోవడం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయి.
hair fall tips in telugu
అయినా పెద్దగా ఫలితం కన్పించదు. ఒకవేళ కన్పించిన అది తాత్కాలికమే. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటానికి కొబ్బరినీళ్లు ఎలా సహాయపడతాయో చూద్దాం. కొబ్బరి నీళ్లను తల మీద మాడు మీద పోసి వృత్తాకార మోషన్ లో మసాజ్ 10 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయాలి.
Cococnut Water Benefits in telugu
20 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఆపిల్ సిడర్ వెనిగార్, కొబ్బరినీళ్ళను సమాన బాగాలుగా తీసుకోని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి.

ఒక కప్పు కొబ్బరినీటిలో అరచెక్క నిమ్మరసం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.