ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 8 వంటింటి చిట్కాలు
Kitchen Tips in Telugu:అన్నం వండినప్పుడు మెత్తగా అయ్యిపోతూ ఉంటుంది. ఆలా మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొంచెం వంట నూనెను వేసి వండితే అన్నం పొడి పొడిగా మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడిగా ఉంటుంది.
పంచదారను ఎంత జాగ్రత్తగా ఉంచినా చీమలు పట్టటం ఖాయం. ఆలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కా ఉంది. పంచదారలో రెండు లవంగాలను వేస్తె చీమలు పట్టకుండా ఉంటుంది. లవంగాల ఘాటుకి చీమలు పంచదార దరిదాపుల్లోకి కూడా రావు.
వంకాయను కట్ చేసినప్పుడు వంకాయ ముక్కలు నల్లగా అయ్యిపోతాయి. ఆలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. గిన్నెలో నీటిని తీసుకోని కొంచెం పాలను పోసి దానిలో వంకాయ ముక్కలను వేస్తే నల్లగా మారకుండా ఉంటాయి. ఎంతసేపైనా వంకాయ ముక్కలు నల్లగా మారవు. అలాగే రుచిలో కూడా ఎటువంటి మార్పు రాదు.
ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రావటం సహజమే. ఆలా కన్నీరు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను అరగంట సేపు నీటిలో ఉంచి కట్ చేస్తే కన్నీరు రాదు. ఉల్లిపాయలో ఉండే సోడియం కారణంగా కన్నీరు వస్తుంది. ఉల్లిపాయలను నీటిలో అరగంట సేపు ఉంచటం వలన ఘాటు తగ్గుతుంది.
కాకరకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒకోసారి పండిపోతూ ఉంటాయి. ఆలా పండి పోకుండా కాకరకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కాకరకాయను ఈ విధంగా కట్ చేసి నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
వంటగదిలో చీమలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఒక పట్టాన పోవు. చీమలు పోవాలంటే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దోసకాయను కట్ చేసి దోసకాయ ముక్కను చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే చీమలు పారిపోతాయి.
వంటగదిలో ఏ పని చేస్తున్న ఈగలు వచ్చేస్తుంటాయి. ఈగలు ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టానా పోవు. ఈ వేసవిలో అయితే ఈగలు చాలా ఎక్కువగా వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈగలు పోవాలంటే ఈ చిట్కా చాలా బాగా సహాయాపడుతుంది. ఈగలు ఉన్న ప్రదేశంలో పసుపు నీటిని జల్లితే ఈగలు రావు.
బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటె ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చిగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకి బొద్దింకలు పారిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.