ఒక్క రాత్రిలోనే కంటి కింద నల్లటి వలయాలు మాయం…అసలు నమ్మలేరు
Dark circles remove Tips in Telugu :బంగాళదుంపను వండినప్పుడు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే పిండిపదార్ధాలు మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బంగాళదుంపలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
బంగాళదుంప చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. బంగాళాదుంప నల్లటి వలయాలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో బంగాళదుంప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బంగాళదుంప రసం లేదా నేరుగా బంగాళదుంప ముక్కను రాయవచ్చు.పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోయాలి.ఈ ముక్కలను ఒక పలుచని క్లాత్ లో వేసి కళ్ళ మీద 15 నిమిషాల పాటు పెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే నల్లటి వలయాలకు బంగాళదుంప రసాన్ని కూడా రాయవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.